ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పరిచయం : మనలో ఒకరి కింద బతకడం ఇష్టం లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. అయితే, దైర్యం లేకపోవడం వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ, మనం కలలను, కలలు గానే చూస్తున్నాము. మీరు వ్యాపార రుణం ద్వారా 50 లక్షల నుంచి 20 కోట్ల దాకా ఋణ సహాయం పొందొచ్చు. దీనిని మీరు కంపెనీ స్థాపించడాని కోసం అయినా, లేదా స్థాపించిన దానిని విస్తరించాలి అనుకున్నా కూడా వ్యాపారం కోసం లోన్ ని తీసుకోవచ్చు
ఇందులో మీకు 10-22% వడ్డీ ఉండనుంది. దాదాపు ఇరవై బ్యాంకులు మీకు తక్షణ వ్యాపార రుణ సహాయాన్ని అందిస్తున్నాయి. ఒకవేళ మీరు ఇప్పటికే స్థాపించిన కంపెనీని నడపడానికి, మీకు డబ్బు అవసరం అయితే, మీరు వర్కింగ్ కాపిటల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ 5 నుంచి 10 సంవత్సరాల లోపు తీర్చేయాల్సి ఉంటుంది. అయితే ఇది, బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి.