ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పూర్వపు రోజులలో, ఇంట్లో ఏదైనా పండగ వచ్చినా, లేదా ఏదైనా వేడుక జరిగినా, ఆ ఇంట్లో ఉన్న వారే, ఇంకొంత మంది సహాయం తో వంటలు వండేవారు. పది నుంచి పాతిక మంది వరకు అయినా అలవోకగా వండేసేవారు. కానీ, ఇప్పుడు అంత ఓపిక కానీ, తీరిక కానీ ఎవరికీ లేవు. వంటల పై అంత సమయాన్ని కూడా వెచ్చించాలి అని అనుకోవట్లేదు.
ఇంట్లో పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా కేటరింగ్ సర్వీస్ ను ఆశ్రయిస్తున్నారు. కేటరింగ్ సర్వీస్ అంటే, ఎంత మందికి ఆహారం వండాలి, ఏమేం పదార్ధాలు ఉండాలి వంటి మనం చెప్పి, డబ్బులు చెల్లిస్తే, ఆ సమయానికి వారే ఆహారాన్ని మనకు అందించి, వడ్డించి వెళ్ళిపోతారు. బాగుంది కదూ! ఈ కేటరింగ్ వంటివి వచ్చాకా, మన సమయం చాలా ఆదా అవ్వడమే కాక, ఇంట్లోని ఆడవారు వారికి కూడా పని భారం నుండి కాస్త విరామం దొరుకుతున్నట్టు అవుతుంది. అందుకే, ఈ బిజినెస్ కు ఎప్పుడు మంచి లాభం మరియు మార్కెట్ను కలిగి ఉంటుంది! ఇంకెందుకు ఆలస్యం, ఈ కోర్సు గురించి మరింత వివరంగా తెలుసుకుందామా!