ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
వాతావరణ మరియు గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా, దాదాపు ప్రపంచంలోని, చాలా దేశాలలో ప్లాస్టిక్ బ్యాన్ నడుస్తుంది. నిన్నా మొన్నటిదాకా, అన్నిటికీ ప్లాస్టిక్ బ్యాగ్ లను ఉపయోగించేవారం, ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ వినియోగించినా, విక్రయించినా చలానా కట్టాల్సి ఉంటుంది. యిటువంటి పరిస్థితులకి ప్రమాయత్నంగా నిలుస్తుంది, కాటన్ బ్యాగ్.
పేరులోనే అర్ధమౌతుంది కదా, ఇది కాటన్ వస్త్రం తో చేస్తారు. ఇవే కాకుండా జ్యూట్ బ్యాగ్, టోట్ బ్యాగ్, క్లోత్ బ్యాగ్ వంటివి మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. వస్త్రంతో చేసే బ్యాగ్ ను టెక్సటైల్ బ్యాగ్ అని పిలుస్తారు. అందులో, కాటన్ బ్యాగ్ అనేది ఒక రకం. ఈ రకం బ్యాగ్ లకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. కొన్ని లెక్కల ప్రకారం, రానున్న రోజులలో, ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే, ఈ బ్యాగులను తయారు చేస్తున్న వారు నెలకు 50 వేల నుంచి అరవై వేల దాకా సంపాదిస్తున్నారు, అది ఇంటి నుంచే! ఈ పరిశ్రమ కోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. కేవలం 20 వేలతో కూడా, వీటిని ప్రారంభించవచ్చు. బాగుంది కదూ! ఈ కాటన్ బ్యాగ్ తయారీ వ్యాపారం కోర్స్ గురించి మరింత తెలుసుకోండి!