ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పరిచయం :
కొత్త బట్టలు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి! మహిళలు, పిల్లలు, మగవారు ఇలా అందరూ ఇష్టంగా వీటిని ధరిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇష్టపడి కొంటుంటారు. కొన్ని సార్లు అవసరం అయి కొంటుంటారు. అంటే, పుట్టిన రోజు, జాబ్ ఇంటర్వ్యూ ఇలా అన్నమాట ! ఉద్యోగులకు రోజుకో మంచి డ్రెస్ ఆఫీస్ కి ధరించి వెళ్ళాలి అంటే, కత్తి మీద సామే! అందుకే, బట్టలు విషయానికి వస్తే, అందరమూ అవసరానికి మించే కొంటూ ఉంటాం. కొన్ని సార్లు emi లేదా అప్పుల రూపంలో కూడా నచ్చిన డ్రెస్ ను కొంటున్నారు.
ఇదే గార్మెంట్ తయారీ పరిశ్రమలకు ఊతం ఇస్తుంది. చాలా మంది, చిన్న స్థాయి బట్టల తయారీ కేంద్రాలను ప్రారంభించాలి, వాటిని ఆన్లైన్ లో అమ్ముకుంటూ, మంచి లాభాలను గడిస్తున్నారు. ఇలా కాకపోయినా, ఏదోక షాప్ తో అనుసంధానం చేసుకుని కూడా మీరు, బట్టల తయారీ వ్యాపారం ని లాభదాయకముగా నడుపుకోవచ్చు.