ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ కు, ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా, లాభదాయకమైన బిజినెస్ గా మారడానికి అవకాశం ఉంది. బయట దొరికే చాక్లెట్ కంపెనీలను డిమాండ్ ఉన్నప్పటికీ, చిన్నా- పెద్దా అందరూ ఇష్టంగా తినేది మాత్రం, హోం-మేడ్ చాకోలెట్స్ నే! పిల్లలకు నాచురల్ ఆహారం ఇవ్వాలి అని ఎప్పుడూ తల్లిదండ్రులు కోరుకుంటారు. దాని కోసం పిల్లలు చాలా ఇష్టపడే చాక్లెట్లు హోమ్-మేడ్ అయి దొరికినప్పుడు, వాటిని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. హోమ్ మేడ్ చోక్లెట్‌ను తినడం/ కొనడం మీకొక హాబీ అయితే, మీరే ఎందుకు దానిని ఒక బిజినెస్ గా మార్చుకుని, ఆదాయం గా సంపాదించకూడదు?
తక్కువలో తక్కువ 5 వేల పెట్టుబడితో కూడా, మీరు ఈ ఇంటి నుండి చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించి నెలకు రూ.50,000 లేదా ఆ పైనా సంపాదించొచ్చు. మీ చాక్లెట్ వ్యాపారం ప్రారంభించడం, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన ప్రక్రియ, మీ చాక్లెట్ లేబుళ్లు, ప్యాకేజింగ్, వంటి ఇతరత్రా అంశాల కోసం మీరు ఇంకెక్కడికి వెళ్లకుండా, మా కోర్సులో చూసి నేర్చుకోవచ్చు.