ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
సౌర శక్తిని ఉపయోగించి, విద్యుత్ ను తయారుచెయ్యడం అనేది, మనకి కొత్త కాదు. ఇప్పడికీ చాలా సార్లు వినే ఉంటాము. అయితే, ఇవి మన దగ్గర పూర్తి స్థాయిలో, వినియోగం అనేది లేదు. వీటికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ముఖ్యమైనది, ప్రజల్లో వీటిపై అవహగాహన లేకపోవడం. కానీ, ఇప్పటికే కొందరు, వీటి ద్వారా, ఏడాదికి రెండు లక్షల దాకా, పొదుపు చేస్తున్నారు అని మీకు తెలుసా?
ఆశ్చర్యంగా ఉందా? వీటి నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవ్వదు. అంతే కాకుండా, వీటి ద్వారా మన డైలీ పనులకి, ఈ పవర్ సరిపోతుంది. అలాగే, ఎక్కువైన విద్యుత్ ను, విద్యుత్ ఆఫీస్ వారికి అమ్మవచ్చు. మనం ఎన్ని యూనిట్స్ అమ్మితే, వారు మనకు యూనిట్ కి కొంత డబ్బు అని చెల్లిస్తారు. ఒకసారి మీరు వీటిని అమర్చుకుంటే, 35 ఏళ్ళ వరకు పని చేస్తాయి. దీని వల్ల పర్యావరణానికి మేలుతో పాటు, మీరు ప్రతి నెలా కరెంటు బిల్ నుంచి విముక్తి పొందొచ్చు. అలాగే, కరెంటు ను అమ్మి, కరెంటు ఆఫీస్ వారి నుంచి డబ్బును పొందొచ్చు. అన్ని విధాలా, లాభం చేకూర్చే ఈ పైకప్పు సౌర శక్తి బిజినెస్ గురించి, ఇప్పుడే తెలుసుకోవడం మొదలు పెట్టండి.