ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పరిచయం :
బాగా చదువుకోవడం మీ ఆశయం, కానీ మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, మిమ్మల్ని మీ కల నుంచి దూరం చెయ్యడానికి ప్రయత్నిస్తుందా? పై చదువులు చదవాలి, లేదా విదేశాల్లో చదవాలి అనే కల ఎలా నెరవేర్చుకోవాలో తెలియడం లేదా? ఇప్పుడే స్టడీ లోన్ గురించి తెలుసుకోండి. ఇందులో, మీ చదువును బట్టి, లక్ష నుంచి కోటి దాకా లోన్ పొందే అవకాశం ఉంది.
వీటిని మీ చదువు పూర్తి అయ్యాక, సంవత్సరం లోపు ఉద్యోగం తెచ్చుకుని, మీరు తిరిగి చెల్లించవచ్చు. ఇందులో నాలుగు లక్షల కంటే తక్కువ తీసుకుందాం అనుకుంటే, మీరు ఎటువంటి హామీ పత్రాలు చూపించనవసరం లేదు. కేవలం మీ తల్లి దండ్రుల సంతకం ఉంటె సరిపోతుంది. అదే, నాలుగు లక్షలు పైన అయితే, మీ తల్లిదండ్రితో పాటు ఇంకొకరి హామీ కూడా కావాల్సి ఉంటుంది . ఈ లోన్ UG మరియు PG చెయ్యడానికి ఇస్తారు. ఈ విద్యా రుణం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడే ఆ వివరాలు తీసుకోండి!