ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
హోటల్ స్థాపించాలి అనే ఆలోచన ఉంటె, మనకు చాలా ఖర్చు అవుతుంది. కానీ అనవసరమైన ఖర్చు ఏమి లేకుండా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే బిజినెస్ ఏదైనా ఉంటె, అది ఫుడ్‌ట్రక్ బిజినెస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇది అమెరికా వంటి దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. మొదటిగా, అక్కడి వారు హాట్ డాగ్ ప్రకటనల కోసం ట్రక్ వాడేవారు అంట! ఎక్కడ పడితే అక్కడ దొరికే ఫుడ్‌ట్రక్ లకు డిమాండ్ పెరిగిపోయింది. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతూ ఉంది. దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. ప్రధానంగా ఒక షాప్, హోటల్ లేదా ఇంకేదైనా పెట్టుకోవడానికి స్థలం అవసరం. కానీ, ఫుడ్‌ట్రక్ లో అలా కాదు. ఎటువంటి స్థలం లీజు వంటివి అక్కర్లేదు. చిన్న మొత్తం తో ట్రక్ కొనుక్కుని దానికి పెయింటింగ్ వేస్తే సరిపోతుంది.
అలాగే, మరొక కలిసొచ్చే అంశం ఏమిటి అంటే, గిట్టుబాటు సరిగ్గా లేనప్పుడు, జనాలు సరిగ్గా లేనప్పుడు రెస్టారెంట్ వారు ఈగలు తోలుకుంటూ గడపాల్సి వస్తుంది. అదే ఫుడ్‌ట్రక్ వెంటనే జన రద్దీ ఉన్న ప్రాంతాలలో పెట్టుకోవచ్చు.
మన దేశంలో ఫుడ్‌ట్రక్ బిసినెస్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎంతో మంది నిరుద్యోగులకు, ఆశా జ్యోతిలా మారిన, ఫుడ్‌ట్రక్ బిసినెస్ పై కోర్సును తీసుకు వచ్చి, ఉపాధి కల్పించడమే, ffreedom app యొక్క లక్ష్యం.