ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
హోమ్ స్టే బిసినెస్ ఇప్పుడిప్పుడే, అన్ని చోట్లా పాపులర్ అవుతున్న బిజినెస్. అసలు, హోమ్ స్టే అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, సాధారణంగా హోటల్ లో ఉండడం సహజం. అయితే, మీరు ఎంత పెద్ద హోటల్ లో ఉన్నప్పటికీ, అది హోటల్ లాగా మాత్రమే ఉంటుంది. హోమ్ స్టే లో, మీకు ఉండడానికి ఒక ఇల్లు మొత్తం ఇస్తారు. అందులో మీరు మీ ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. వంట చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. వారే వంట, వాషింగ్ మెషిన్ వంటివి అన్నీ సౌకర్యాలు కలిపిస్తారు. బాగుంది కదూ!
ఈ ఆలోచనే, ఇప్పుడు అన్నీ హోమ్ స్టే బిజినెస్ వారికి మంచి లాభాలు గడించి పెడుతుంది. ఇంతకు ముందు, ఇవి ఎక్కువగా గోవా, ఊటీ, పాండిచ్చేరి వంటి పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పడూ అన్నీ ప్రాంతాల్లో, ఇవి ఉంటున్నాయి. అలాగే, ప్రజలు కూడా హోటల్ లో ఉండడం కంటే, హోమ్ స్టే వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.