ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఈ మధ్య కాలంలో, ఎక్కడ చూసిన డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ లేదా కంటెంట్ క్రియేటర్ అనే పదాలు తరచుగా వింటూనే ఉన్నాం. మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే మీమ్స్ నుంచి, మీరు యూట్యూబ్ లో ఎంజాయ్ చేసే షాట్స్ , రీల్స్ వంటివి అన్ని, లేదా మీరు ఇష్టపడి చదివే బ్లాగ్స్ అన్ని ఈ కోవకే చెందుతాయి.
అర్ధం కాలేదా? డిజిటల్ మీడియా లో మార్కెటింగ్ ఒక కన్ను అయితే, కంటెంట్ అనేది ఇంకొక కన్ను. ఇవి రెండు సరిగ్గా పని చేస్తే కానీ, మీరు మీ లక్ష్యాన్ని చేరుకోలేరు.
అంటే, కంటెంట్ బాగోకపోయినా, అలాగే మార్కెట్ టీం, వారి పని వారు చేయలేకపోయినా మన కంపెనీ నష్టాల దిశగా పయనించే అవకాశం లేకపోలేదు. అయినా, మార్కెటింగ్ అనేది ఎవరైనా చేసే విధంగా ఉంటుంది. కానీ కంటెంట్ లేదా సమాచారాన్ని సృష్టించే పని అందరూ చెయ్యలేరు. దానికి మీకు ప్రతిభ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే.
సోషల్ మీడియా లో ఫొటోస్, వీడియోస్, ఆర్టికల్స్ ఇలా చాలా కంటెంట్ అనేది మనం సృష్టిస్తూ ఉండాలి. మరీ వాటిని ఎలా సృష్టించాలి? వారిని తయారు చెయ్యడానికి మనకు ఎటువంటి టూల్స్ లేదా సాఫ్ట్-వేర్ లు ఉపయోగపడతాయి? ఇలాంటి మీ సందేహాలను నివృత్తి చేసి, మిమ్మల్ని మంచి కంటెంట్ క్రియేటర్ మార్చడమే, మా కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ కంటెంట్ క్రియేటర్ కోర్సు గురించి నేర్చుకుని అన్ని వివరాలు తెలుసుకుని, ఇందులో జాయిన్ అయ్యి, మీ ప్రతిభతో… ఈ ప్రపంచాన్ని ఉర్రుతలు ఊగించండి!