ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలకు వెళ్లడం వల్ల ఒక కుటుంబానికి వారి దుస్తులు ఉతకడం, క్లీన్ చేసి మడత పెట్టుకోవడం అన్నీసార్లు కుదరక పోవచ్చు! అలా అని బట్టలు ఉతకకుండా వదిలేస్తే,అవి కొండలా పెరిగిపోతుంది. ఇలాంటి ఇబ్బందులన్నీటికీ ఒకే పరిష్కారం, లాండ్రీ బిజినెస్.
పట్టణాలలో అన్ని చోట్లా వీధికి ఒక లాండ్రీ షాప్ ఉంటూ ఉంది. నగర వాసులు, ఉద్యోగస్తులు వీటిని వారంలో ఒక సారి కానీ రెండు సార్లు కానీ వినియోగించుకుంటూ ఉన్నారు. రానున్న రోజులలో ఈ బిజినెస్కు మరింత డిమాండ్ ఉండనుంది.
లాండ్రీ బిజినెస్ ప్రారంభించినట్లయితే మీకు ఎంత లాభం లభిస్తుంది, దీనిని ఎక్కడ ప్రారంభించాలి. ప్రారంభ పెట్టుబడి ఎంత ఉండాలి. ఈ వ్యాపారం నడిపే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వంటి అన్నీ అంశాలు, ఈ కోర్స్ నుంచి మీరు నేర్చుకోవచ్చు.