ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ కోర్సు అనేది, తాగునీరు సరఫరా చెయ్యడం మరియు దాని ద్వారా సంపాదించడం. ఈ కోర్సులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపార నిపుణులకు ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని బోధించడానికి రూపొందించబడింది. ఈ కోర్సులో వ్యాపార ప్రణాళిక, మార్కెట్ పరిశోధన, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మరియు రెగ్యులేటరీ వంటి అంశాలతో సహా అనేక రకాల అంశాలను కవర్ చెయ్యబడ్డాయి.
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వ్యాపారం గురించి నేర్చుకోవడానికి, స్థాపించడానికి ఎవరైనా అర్హులే, మీరు ఎటువంటి విద్యార్హత కలిగి ఉన్నా, ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ స్థాపించడానికి, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. కానీ, కొన్ని విషయాలను తెలుసుకుని ప్రారంభించడం ఎంతో అవసరం. అటువంటి, అంశాలను గురించి, మీరు ఈ కోర్సులో నేర్చుకోనున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ కోర్సు గురించి మరింత తెలుసుకుందామా?