ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు, డబ్బుకి డబ్బుకి కూడా తెచ్చిపెట్టే బ్రాయిలర్ కోడి పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది మన దేశంలో ఎప్పటినుంచో ఉంది. చికెన్లో ఉండే పోషకాలు, రుచి వీటికి కారణం. అందుకే, బ్రాయిలర్ చికెన్, కిలో రూ.150-250 మధ్య ఉంటుంది. ఆదివారం వస్తే, దాదాపు అందరి ఇళ్లలో ఉండే వంటకం చికెన్. అందులో చికెన్ షాపులో 90 శాతం అమ్ముడుపోయేది, ఈ బ్రాయిలర్ చికెన్!
ఇప్పటికే, అర్ధం చేసుకున్నారు కదా, బ్రాయిలర్ కోడికి ఉండే డిమాండ్! పౌల్ట్రీ ఫార్మింగ్,దీనిని మీరు రెండు రకాలుగా చెయ్యవచ్చు. ఒకటి, మీరే పూర్తి బాధ్యత వహించడం. ఇటువంటి ఫార్మింగ్లో, వీటిని పెంచడానికి అయ్యే మొత్తం ఖర్చు మీరే భరిస్తారు, మీరే నిర్వహణ బాధ్యతలు మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే, పూర్తి లాభం అయినా, నష్టం అయినా మీకు చెందుతుంది. ఇక రెండవ విధానంలో మనం కొన్ని బిజినెస్ కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకుంటాం. అంటే వెంకాబ్ చికెన్, స్నేహ చికెన్ వంటివి అన్నమాట! ఫార్మింగ్ మరియు మౌలిక సదుపాయాలు మనం చూసుకుంటే, నిర్వహణ బాధ్యతలు వారు చూసుకుంటారు. కిలోకి ఇంత లాభం కింద ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ బ్రాయిలర్ కోడి ఎదగడానికి, 40 రోజుల కాలం పడుతుంది.
అందువల్ల, నలభై రోజులలో తొంబై వేలు సంపాదించిపెట్టే, ఈ బిజినెస్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.