4.4 from 12.1K రేటింగ్స్
 2Hrs 39Min

సి. ఎస్. సుధీర్‌తో ప్రొవిజన్ స్టోర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ

చిన్న చిన్న మార్పులు సూచించి ప్రొవిజన్ స్టోర్‌ను లాభాల బాట పట్టించిన ffreedom CEO సీ.ఎస్ సుధీర్.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Provision Store Transformation Video
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(26)
వ్యవసాయం కోర్సులు(65)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
2Hrs 39Min
 
పాఠాల సంఖ్య
7 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
డబ్బు నిర్వహణ చిట్కాలు,వ్యాపార అవకాశాలు, Completion Certificate
 
 

"ప్రొవిజన్ స్టోర్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ (కిరణా షాపు వ్యాపార నిర్వహణలో మార్పు)_కోర్స్" అనేది కిరాణా షాపు యజమానులు తమ వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి మరియు మార్కెట్‌లో పోటీని ఎదుర్కొంటూ విజయవంతంగా కొనసాగించడానికి ఒక సమగ్ర మార్గదర్శి అని చెప్పవచ్చు. ఈ కోర్సు ఐదు మాడ్యూల్స్ (విభాగాలు) గా విభజించబడింది. ప్రతి ఒక్క మాడ్యూల్ విజయవంతంగా కిరాణా షాపును నిర్వహించడానికి అవసరమైన విభిన్న అంశాలను కవర్ చేస్తుంది.

 

వ్యాపారం & యజమాని పరిచయం: కిరాణా స్టోర్ పరిశ్రమ మరియు కిరాణా స్టోర్ నిర్వహణలో యజమాని పాత్ర గురించి ఈ మాడ్యూల్ సంపూర్ణ అవగాహనను గలిగిస్తుంది. ఈ మాడ్యూల్ కిరాణా షాపు ప్రారంభించడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం తదితర విషయాలను తెలియజేస్తుంది. నూతన వ్యాపారంలోకి అడుగుపెడుతున్నప్పుడు అత్మవిశ్వాసంతో ఉండటం ఎందుకు అవసరమో కూడా ఈ మాడ్యూల్ ద్వారా నేర్చుకుంటాం.

 

వ్యాపారంలో సమస్యలు & సవాళ్లను అర్థం చేసుకోవడం: కిరాణా స్టోర్ యజమానులు ఎదుర్కొనే సాధారణ సవాళ్లు మరియు వాటిని ఎలా అధిగమించాలో ఈ మాడ్యూల్ ద్వారా నేర్చుకుంటాం. కిరాణా స్టోర్ యజమానులు వ్యాపార వ్యవహారాల్లో భాగంగా తీసుకునే నిర్ణయాలు వినూత్నంగా ఎందుకు ఉండాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. వినియోగదారులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం యొక్క ఆవశ్యకతను ఈ మాడ్యూల్‌ చర్చిస్తుంది.

 

ఆధునికీకణ ప్రణాళికను రూపొందించడం: ఈ మాడ్యూల్ వ్యాపారాన్ని ఆధునికీకరించడానికి మరియు మెరుగుపరచడానికి ఒక ప్రణాళికను అభివృద్ధి చేయడంపై అవగాహన కలిగిస్తుంది. నూతన సాంకేతికతలను అమలు చేయడం మరియు సమర్థవంతమైన వ్యాపార పద్ధతులను అవలంబించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. అలాగే ఆధునీకరణ ప్రణాళికను రూపొందించడంలో ఉన్న దశలను కూడా ఈ మాడ్యూల్ తెలియచేస్తుంది.

 

ఆధునికీకరణ ప్రణాళిక అమలు: ఈ మాడ్యూల్ ఆధునికీకరణ ప్రణాళికను అమలు చేయడంలో ఉన్న దశలను తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ ఆధునికీకరణను అమలు చేస్తూనే వ్యాపారంలో ఎలా కొనసాగాలో అందుకు అవసరమైన సలహాలు, చిట్కాలను ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకుంటాం.  ముఖ్యంగా ప్రణాళిక అమలు సమయంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి అనుసరించాల్సిన విధానాల గురించి ఈ మాడ్యూల్‌లో నేర్చుకుంటాం. అదేవిధంగా మన ప్రాథమిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం ఎలాగో ఈ మాడ్యూల్ నేర్పిస్తుంది.  

 

ది ట్రాన్స్‌ఫర్మేషన్ స్టోరీ: వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి ఈ కోర్సులో పొందుపరిచిన టెక్నిక్‌లను ఉపయోగించిన కొంతమంది కిరాణా స్టోర్ యజమానుల విజయ కథనాలను ఈ మాడ్యూల్ మనకు తెలియజేస్తుంది. ఎంతోమంది కిరాణా షాపు యజమానులు విభిన్న సవాళ్లను అధిగమించి విజయం సాధించడానికి ఈ కథనాలు వారికి స్ఫూర్తిని కలిగిస్తాయి.

 

సంబంధిత కోర్సులు