ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పట్టుదారాలతో నగలు తయారు చేయడం ద్వారా నెలకు దాదాపు రూ.1 లక్ష లను సంపాదించవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సరైన ప్రణాళికతో తక్కువ ధరకే ముడి సరుకును కొనుగోలు చేసి వాటి ద్వారా అందమైన గాజులు, నెక్లెస్, జుంకాలు తదితర నగలను తయారు చేసి విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయి. ముఖ్యంగా తయారైన వస్తువులను పండుగల సమయంలో అమ్మడం ద్వారా మరింత లాభాలను పొందవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలన్నింటిని ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి!