ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
వ్యాపారం ప్రారంభించడానికి రుణాలు, లేదా వ్యాపారాన్ని అభివృద్ధి చెందించాలన్నా రుణాలు అవసరం ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే కొన్ని రంగాలకు చెందిన వ్యాపారాభివృద్ధికి ఆ మొత్తం కోటి రుపాయల వరకూ ఉంటుంది. అంతమొత్తాన్ని బయటి వ్యక్తుల వద్ద లేదా ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటే ఎక్కువ వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అయితే కేంద్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన స్టాండప్ ఇండియా పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి కోటి రుపాయాల వరకూ తక్కువ వడ్డీని అనుసరించి రుణాలు తీసుకోవచ్చు. ఈ కోర్సు ద్వారా అందుకు సంబంధించిన వివరాలన్నీ నేర్చుకుందాం.