ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
సరైన వ్యూహం, కొంచెం కష్టపడే తత్వం ఉంటే పాపడ్ తయారీ వ్యాపారం మీకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న కొంతమంది నెలకు రూ.10 లక్షల ఆదాయాన్ని కళ్ల చూస్తున్నారు. ఇది కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నా ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో ఈ కోర్సు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే ఇప్పటికే ఈ అప్పడాల తయారీ వ్యాపారంలో ఉన్నవారితో నేరుగా మాట్లాడి వారి అనుభవాలతో పాటు వ్యాపార నిర్వహణకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చు. ఎప్పుడూ ఒకే రకమైన అప్పడాల కాకుండా పప్పు, బియ్యం, గోధుమలు, బంగాళదుంప తదితర రకాల పాపడ్స్ తయారు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వీటి రుచి, ఆకారం దేనికదే ప్రత్యేకం అందువల్ల విభిన్న వినియోగదారులను ఆకర్షించడానికి వీలవుతుంది. ఇక పాపడ్ తయారీ తర్వాత ప్యాకింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడమే కాకుండా ఎక్కువ దూరం రవాణా చేయడానికి వీలవుతుంది. అటు పై స్థానిక మార్కెట్లో స్టాల్స్ ఏర్పాటు చేయడం, Amazon వంటి ఈ కామర్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని అమ్మడం వల్ల కూడా అధిక విక్రయాలను కొనసాగించవచ్చు. ఈ విధంగా పాపడ్ తయారీ వ్యాపారం, విక్రయానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో మెళుకువలు ఈ కోర్సు ద్వారా నేర్చుకుని నెలకు రూ.10 లక్షలను సంపాదించవచ్చు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సులో చేరి పాపడ్ తయారీ మెళుకువలను నేర్చుకోండి.