ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
భారత దేశంలో ప్రతి వంద మంది పారిశ్రామిక వేత్తలో మహిళలో కేవలం 14 మంది మాత్రమే మహిళలు ఉన్నాయి. మిగిలిన 86 మంది పురుషులే. దీన్ని అనురించి పారిశ్రామిక, వ్యాపార రంగంలో ఇప్పటికీ వారి పాత్ర నామ మాత్రంగానే ఉందని అర్థమవుతోంది. అయితే సరైన అవకాశాలు కల్పిస్తే మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించగలరు. ఈ క్రమంలో ప్రభుత్వం పారిశ్రామిక రంగం లేదా వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి ప్రత్యేక ప్రోత్సహాకాలు, సబ్సిడీలు కల్పిస్తోంది. వీటిని వినియోగించుకోవడంతో పాటు అవసరమైన మెళుకువలను నేర్చుకుని పారిశ్రామిక రంగంలో ఎలా రాణించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి.