ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మనలో చాలా మందికి, రోజంతా పనులు, ఉద్యోగాలు చేసి అలసిపోయి… ఇంటికి రాగానేనో లేదా ఇంటికొచ్చే దారిలోనో, యూట్యూబ్ లో మీకు నచ్చిన ఒక కామెడీ సీనో లేదా మీరు ఇష్టపడే సీరియల్ యాక్టరు ఫ్రిడ్జ్ టూరో… లేదా ఇవేం కాకుండా, కేరళలో ఉండే ఆలయం వెనుక మిస్టరీ ఏంటి అనో, ఇలా ప్రతి విషయానికి… అది విజ్ఞానం అయినా, వినోదం అయినా లేదా సమాచారం అయినా లేదా రేపటి పరీక్షకి కావాల్సిన ప్రిపరేషన్ కోసమో, మనం యూట్యూబ్ ని వాడుతూనే ఉంటాము.
యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా సమాచార మాధ్యమం. ఇందులో మనం వీడియోస్ అప్లోడ్ చెయ్యవచ్చు, అప్లోడ్ చేసినవి వీక్షించవచ్చు. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద జనాదరణ కలిగిన వెబ్ సైట్. ప్రపంచంలో ఎక్కడా దొరకని సమాచారం కూడా మనకి యూట్యూబ్ లో దొరుకుతుంది.
మీరు ఒక పక్క చూసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో, ఎంతో మంది యూట్యూబర్స్, యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడం మరియు యూట్యూబ్ ఆధారంగా లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. వారు ఒకసారి వీడియో అప్లోడ్ చేసాక, వారు నిద్రపోయేటప్పుడు కూడా వారి అకౌంట్ లలో లక్షలు లక్షలు వచ్చి పడుతున్నాయి. వయసుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరు, నెలకి ఒక లక్ష నుంచి 50 లక్షల దాకా సంపాదిస్తున్నారు.
ఇవన్నీ చూసి, మనం కూడా యూట్యూబ్ పెడదాం అని ఎంతో మంది యూట్యూబ్ మొదలు పెట్టి ఉంటారు. కానీ వారు ఆశించిన స్థాయిలో, ఆదాయం లేక చానెల్స్ ను మూసేసి ఉంటారు. వీటన్నికి ప్రధాన కారణం,
మీకు యూట్యూబ్ అంటే సరైన అవగాహన లేకపోవడం! ఈ యూట్యూబ్ కోర్సు నుంచి యూట్యూబ్ ను ఆదాయంగా మార్చుకోవడం అనే విషయంపై పూర్తి అవగాహన పొందండి!