ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రైతే తన పంటకు వాల్యూ అడిషన్ (విలువను జోడించడం)తో పాటు ధర నిర్ణయించడం నేర్చుకోగలిగితే ఎక్కువ లాభాలను చవి చూడవచ్చు. ఉదాహరణకు సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన మునగ ఆకును అలాగే మార్కెట్‌లో అమ్మితే తక్కువ లాభం వస్తుంది. అదే మునగ ఆకును ఎండబెట్టి పొడి చేస్తే అంటే పంటకు వాల్యు అడిషన్ వల్ల లాభం రెట్టింపు అవుతుంది. ఇదే సేంద్రియ విధానంలో అంటే జీవామృతం మరియు గోకృపామృతం వంటివి ఎరువులుగా వాడి మోరింగాను సాగు చేయడం వల్ల ఈ లాభం మరింత ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా మునగ ఆకుకు వాల్యు అడిషన్ చేయడం వల్ల ఎకరాకు కనిష్టంగా రూ.10 లక్షలు గరిష్టంగా రూ.20 లక్షల వరకూ సంపాదించవచ్చు. ఇలా పంటకు విలువ జోడించి మార్కెట్ చేయడం ఎలాగో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం.