ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పండ్లలో రాజు మామిడి అయితే రాణి అరటి. ఇందుకు ప్రధాన కారణం ఈ పండు రుచే. దీనిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. అంతే కాకుండా సంవత్సరంలో 365 రోజులూ దీనికి డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో అరటి ఉత్పత్తి జరుగుతోంది. అరటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో సుగంధ లేదా కర్పుర లేదా చక్కెరకేళిని ఎక్కువ విస్తీర్ణంలో అరటి సాగు చేస్తున్నారు. ఇక మనవద్ద పండే అరటి రకాల్లో గ్రాండ్ నైన్ ఒక్క హెక్టారుకు 70 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ఇది ఇన్ని విశేషాలు ఉన్న ఈ అరటి సాగు గురించి ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.