ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పాడి, పశువుల పెంపకం రంగంలో లాభాలను అందుకోవాలని ఉందా? అయితే మీకు జమునపరి మేకల పెంపకం కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది. సమగ్రమైన వివరాలతో రూపొందించిన ఈ కోర్సు జమునాపరి జాతి మేకల పెంపకానికి సంబంధించిన ఎంతో పరిజ్ఞానాన్ని అందిస్తుంది. కాగా, భారత దేశానికి చెందిన జమునపరి మేకల జాతి అటు పెంపకం వల్ల అధిక లాభాలు అందుకోవచ్చు.
కోర్సులో మీరు జమునపరి మేక భౌతిక లక్షణాల పై అవగాహన పెంచుకుంటారు. ఉదాహరణకు పొడవాటి వీటి చెవులు మిగిలిన జాతి మేకలతో పోలిస్తే ఈ జాతి మేకలను వేరు చేస్తాయి. అదేవిధంగా ఈ జాతి మేకల నుంచి కేవలం మాంసానికే కాకుండా పాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇటువంటి విషయాలన్నింటిని ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం. వాటి మాంసం మిగిలిన మేకల మాంసంతో పోలిస్తే చాలా మృదువుగా ఉండటం వల్లే మార్కెట్లో అధిక డిమాండ్‌కు కారణం. కాగా ఈ కోర్సు ద్వారా జమునపరి మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను నేర్చుకుంటారు. ఈ కోర్సు ద్వారా పొందిన పరిజ్ఞానంతో మీరు ఒక సంవత్సరానికి రూ.1 లక్ష వరకూ సంపాదించవచ్చు. తమిళనాడుకు చెందిన అశోక్ కుమార్ జమునపరి మేకల పెంపకంలో విశేష అనుభవం ఉంది. ఈ రంగంలో అతను ఆదర్శ రైతుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ కలిగి ఉన్నా మేకల పెంపకం పై మక్కువతో ఈ రంగంలోకి వచ్చాడు. మొదటి తక్కువ సంఖ్యలో మేకలను పెంపకాన్ని చేప్పటిన అతని వద్ద ఇప్పుడు 600 మేకలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి లక్షల రుపాయాల ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఇంతటి విజయవంతమైన రైతు మీకు ఈ కోర్సులో మెంటార్‌గా వ్యవహరిస్తాడు.
కోర్సు ముగిసే సమయానికి, మీరు జమునపరి మేకల పెంపకం మరియు మార్కెటింగ్‌కు అవసరమైన పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. లాభదాయకమైన జమునపరి మేక పరిశ్రమలో మీ లాభాలను ఎలా పెంచుకోవాలో మరియు మీకంటూ ఒక పేరు తెచ్చుకోవడం ఎలాగో నేర్చుకుంటారు. మరెందుకు ఆలస్యం వెంటనే ffreedom App లోని జమునపరి మేకల బ్రీడింగ్ కోర్సు - ఒక మేక నుండి సంవత్సరానికి రూ.1 లక్ష వరకూ సంపాదించండి! కోర్సులో జాయిన్ అవ్వండి. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో మొదటి అడుగు వేయండి.
ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?
జమునపరి మేకల పెంపకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు
జమునపరి మేక జాతి లక్షణాలను అర్థం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న పశుపెంపకందార్లు
మేకల పెంపకంపై తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోని ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నవారు
జమునపరి మేకల పెంపకం, విక్రయ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారు
పాడి, పశుపెంపకం సంబంధిత కోర్సులను చదువుతున్న విద్యార్థలు
ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:
జమునపరి మేకల పెంపక విధానాల్లోని చిట్కాలు
జమున పారి మేకలకు అందించాల్సిన ఆహారం మరియు వాటి సంరక్షణ పద్ధతులు
జమునపరి మేకల మాంసం మార్కెటింగ్ విధానాలు మరియు ధర వ్యూహాలు
జమునపరి మేకలకు వచ్చే వ్యాధులు వాటి నివారణ పద్ధతులు
జమునపరి మేకల పెంపకానికి అవసరమైన షెడ్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మించడం
మాడ్యూల్స్