ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఏదైనా అనుకోని విపత్తు సంభవించినప్పుడు, లేదా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడికి సంబంధించిన వారికి కొంత సొమ్ము బీమాగా లభిస్తుంది. అలాగే, జరిగిన ఆస్తి నష్టం తిరిగి పొందడానికి కూడా, మనకు బీమా ఉపయోగ పడుతుంది. అలాగే, మన దేశంలో వ్యవసాయం అనేది ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. అయితే, కొన్ని సార్లు అతివృష్టి, కొన్ని సార్లు అనావృష్టి, మరి కొన్ని సార్లు మార్కెట్ సరిగ్గా లేక నష్టపోవడం లేదా, పంట చేతికి వచ్చే సమయానికి పురుగు రావడం, ఇలా ఎన్నో ప్రమాదాల నుంచి, ఫసల్ బీమా మన పంటల్ని కాపాడుతుంది.
ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన తీసుకుంటే, మీరు నష్టపోయిన పంట సొమ్ము మీకు బీమాగా లభిస్తుంది. అయితే, ఈ బీమా అనేది, ప్రభుత్వంచే గుర్తింపబడిన పంటలు, ప్రాంతాలలో మాత్రమే వర్తిస్తుంది. ఇందులో మీరు 2% మాత్రమే ప్రీమియం కింద చెల్లించాల్సి ఉంటుంది.