ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పరిచయం
మనం రెగ్యులర్ గా ఇష్టంగా తినే, చికెన్, మటన్, సీ-ఫుడ్ తో పాటు, అందరూ ఇష్టంగా తినే ఇంకొక మాంసం ఉంది, అదే కుందేళ్లు మాంసం. మన దేశంలో కుందేళ్లు వేటాడడం చట్ట రీత్యా నేరం. అందువల్లనే, చాలా మంది వీటిని ఫార్మింగ్ చేస్తూ పెంచుతున్నారు. మన దేశంలో, తమిళనాడు, కేరళ లో ఇప్పటికే చాలా చోట్ల వీటి ఫార్మ్ లు అనేవి స్థాపించారు. ఇవే కాకుండా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా చాలా చోట్ల వీటిని, ఉన్ని కోసం పెంచుతున్నారు.
వీటి నుంచి మనం నాలుగు రకాలుగా లబ్ది పొందొచ్చు . వీటి మాంసం, ఉన్ని, వీటి పిల్లలు మరియు, దీని నుంచి వచ్చే చెత్తను కూడా అమ్ముకోవచ్చు. గొఱ్ఱె నుంచి తీసిన ఉన్ని కంటే, కుందేలు ఉన్నికి డిమాండ్ అధికంగా ఉంది. దీని మాంసం ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు, ఆరోగ్యం కూడా! ఇప్పుడే ఈ కోర్సును పొంది, కుందేళ్లు పెంపకం గురించి పూర్తిగా తెలుసుకోండి!