ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
గంధం చెట్లు విలువ మీ అందరికి తెలుసు. చందనం అంటే ఏమిటి? వీటినే శ్రీగంధం, శాండల్, చందనం చెట్లు అని కూడా పిలుస్తారు. ఇదొక దీర్ఘకాలం పంట! అంటే, మీరిప్పుడు పంట వేస్తే గనుక, పదిహేను సంవత్సరాల తర్వాత, వాటి ప్రతిఫలం పొందొచ్చు. ఒక కేజీ కలపకు, శ్రీ గంధం ధర 10 వేల నుంచి ఇరవై వేల దాకా ధర పలుకుతుంది. దీని యొక్క వేర్లు, కాండం ఇలా ప్రతి ఒక్కటి ప్రత్యేక విలకువను కలిగి ఉన్నాయి.
వీటి నుంచి తీయ్యబడిన చెక్కను సుగంధ ద్రవ్యాలలోనూ, నూనెలతో, సబ్బులలో, పౌడర్లలో, అగర్బత్తీలలో, అలాగే వాటి చెక్కను గృహోపకరణాలు, సంగీత వాయిద్య పరికరాలలో ఉపయోగిస్తారు. వీటిని పెంచే సమయంలో, వీటి పక్కనే మనం ఇంకొక్క మొక్కను/ చెట్టును పెంచాల్సి ఉంటుంది. వాటి ద్వారా కూడా మనం లాభం పొందవచ్చు. ఈ శ్రీ గంధం సాగు వివరాలు గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ కోర్సును పొందండి.