ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
కొన్ని ఉద్యోగాల్లో గానుగలా పనిచేసినా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. అయితే గానుగను ఆడించి లక్షల రుపాయల ఆదాయాన్ని మనం కళ్లచూడవచ్చు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి నూనెను తీసే వారు. ఈ విధానానికి ఆధునిక సాంకేతికతను జోడించి సహజ సిద్ధంగా వంటనూనెలను తయారు చేసి మార్కెట్ చేసుకుంటే నెలకు అక్షరాల లక్ష రుపాయల ఆదాయాన్ని కళ్ల చూడవచ్చు. మరెందుకు ఆలస్యం రండి ఈ కోర్సు ద్వారా ఆ వ్యాపార మెళుకువలను నేర్చుకుందాం. అంతేకాకుండా పర్యావరణ అనుకూల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిద్దాం.