ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మార్కెటింగ్‌లో ఇది ప్రాథమిక సూత్రం. దీనినే మనం నాన్ వెజ్ మార్కెట్‌కు కూడా అన్వయించవచ్చు. ప్రస్తుతం రోజు రోజుకు నాన్ వెజ్ ప్రియుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అయితే అందుకు తగ్గట్టు సరఫరా ఉండటం లేదు. ఈ క్రమంలో మనం మేక మరియు గొర్రెల పెంపకం డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయగలిగితే లక్షల ఆదాయాన్ని మనం పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు.