ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
స్థానిక జాతి ఆవులతో పోలిస్తే హెచ్ ఎఫ్ ఆవులు ఎక్కువ పరిమాణంలో పాలను ఇస్తాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక్క పూటకే దాదాపు 15 లీటర్ల పాలను ఇచ్చే హెచ్ ఎఫ్ ఆవుల పెంపకం డెయిరీ రంగంలో రాణించాలనుకునేవారికి ఎంతో ఉపయుక్తం. ఇక పాలలో విటమిన్లు, పోషకాలు కూడా ఎక్కవ సంఖ్యలో ఉంటాయి. అంతేకాకుండా ఈ జాతి ఆవుల ధరలు కూడా తక్కువ. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెచ్ ఎఫ్ జాతి ఆవులు డెయిరీ రంగంలో రాణించాలనుకునే వారికి చాలా ఉపయుక్తం. మరెందుకు ఆలస్యం ఈ కోర్సులో HF ఆవుల పెంపకం గురించి తెలుసుకుందాం రండి.