ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
తేనే పేరు నుంచి రుచి దాకా ప్రతిదీ అతి మధురంగానే ఉంటుంది. అందుకే మనం మధురమైన, మంచి విషయాలను హనీ తో పోల్చి మాట్లాడతాం. తేనే లాంటి మనసు… ఇలా అన్నమాట. ఇంతలా రుచితో పాటు పోషకాలను ఇందులో నింపుకోబట్టే, ప్రతి ఇళ్లలో ఇది చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 3000 కోట్ల బిజినెస్, తేనే మీద నడుస్తుంది. తేనెటీగలలో రెండు వేలకి పైగా రకాలు ఉన్నాయి. మన దేశంలో నాలుగు రకాలు లభిస్తాయి. అవి పుట్టె జాతి, కొండ జాతి, ముసురు జాతి మరియు ఐరోపా జాతి. వీటిలో ఇళ్లలో వీటి పెంపకం కొరకు పుట్టె జాతి, వాణిజ్య అవసరాలకై ఐరోపా జాతిని ఎక్కువగా వాడుతుంటారు.
ఇవి పెరగడానికి 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. 35 డిగ్రీల వేడిని దాటితే ఇవి చనిపోతాయి. వీటిని బాక్సలలో పెంచుతుంటారు. ఒక్కో బాక్స్ ఖర్చు 5000 ఉంటుంది. ఈ బిసినెస్ ప్రారంభించడానికి మీకు పెట్టుబడి రెండున్నర లక్షల నుంచి మొదలు అవుతుంది. వీటి నిర్వహణ కోసం ఎక్కువ శ్రమ, ఖర్చు ఉండదు. ఎన్నో లాభాలను తెచ్చి పెట్టె, ఈ తేనెటీగల పెంపకం గురించి, ఈ కోర్సులో మరిన్నీ విషయాలు తెలుసుకుంటారు.