ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
చేపల పెంపకానికి సీడ్ అన్నది చాలా అవసరం. చేప గుడ్లను సేకరించి వాటి నుంచి చిన్న చిన్న పిల్లలను పొదిగించి విక్రయించడాన్నే క్లుప్తంగా హాచరీ బిజినెస్ అంటారు. అంతేకాకుండా చేపల పెరుగుదలకు అవసరమైన ఆహారాన్ని కూడా మనం ఆక్వా రైతులకు ఈ వ్యాపారంలో భాగంగా సమకూరుస్తాం. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ఇందులో తక్కువ సమయంలో లాభాలను కళ్ల చూడవచ్చు. సరైన ప్రణాళికలతో ఫిష్ హేచరీ వ్యాపారం నిర్వహిస్తే 30 శాతం లాభాలను మనం అందుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ లాభాలను ఎలా అందుకోవాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం.