ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
అతి తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న మాంసాహారం ఏమిటంటే ఎక్కువ మంది చెప్పే సమాధానం రొయ్యలు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమే. అందుకే రొయ్యలకు మార్కెట్‌లో డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అంతేకాకుండా వీటికి విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రొయ్యలను సాగు చేసి ఎగుమతి చేస్తే లాభాల సిరులు కురుస్తాయి. అందుకే దేశంలోని చాలా ప్రాంతాల్లో రొయ్యల సాగుకు ఎక్కువ మంది యువత ముందుకు వస్తున్నారు. అయితే రొయ్యల సాగు అనుకున్నంత సులభం మాత్రం కాదు. ఇందుకు చాలా నైపుణ్యాలు కావాలి. సదరు నైపుణ్యాలన్నీ ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.