ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రైతులు దేశానికీ వెన్నెముక వంటి వారు. మన దేశంలో 60 శాతం మంది రైతు వృత్తిలో ఉన్నారు. కానీ, వారందరూ సంతోషంగా ఉన్నారా, అంటే… లేదు! ఇందుకు ప్రధాన కారణం, వారు ఎక్కువ వడ్డీ కి డబ్బును తెచ్చి, పంట కోసం ఖర్చు చేస్తారు. కానీ పంట చేతికి వచ్చే సమయంలో వివిధ కారణాల చేత, పంట నష్టపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఇటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికే, కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఇది కేవలం రైతులకి మాత్రమే వర్తిస్తుంది. మీరు మీ పంటకి కావలసిన అన్నీ వస్తువులు, ఈ కార్డు ను వాడుకొని కొనుక్కోవచ్చు. ఇందులో నుంచి డబ్బులు తీసుకోవచ్చు. సాధారణంగా క్రెడిట్ కార్డుల పై 36 శాతం వడ్డీ ఉంటె, ఇందులో కేవలం 4% మాత్రమే ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు, ఈ కోర్సులో ఉండనున్నాయి.