ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రైతులు సంవత్సర కాలం పాటు కష్టపడి, పంటను పండించిన తర్వాత, కొన్ని సార్లు లాభపడొచ్చు. కొన్ని సార్లు నష్టపోవచ్చు. అంతే కాకుండా, ఆరు నెలలకు, లేదా ఏడాదికి మాత్రమే, మీకు యాభై వేల నుంచి లక్ష రూపాయాలు చేతికి అందుతుంది. అదే మీరు సమీకృత పద్దతులలో వ్యవసాయం చేసినట్టు అయితే, నెలకి ముప్పై నుండి నలభై వేల వరకు, సంపాదించే ఛాన్స్ ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం గురించి ఎప్పుడైనా విన్నారా?
ఒకే స్థలంలో రకరకాల పంటలు మరియు పాడి పరిశ్రమ పెంచడాన్నే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు. ఇందులో, ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ ఉపయోగించి, ఉత్తమ దిగుబడిని పొందడం మరియు పాడి, చేపల పెంపకం, పంట భూమి మొదలైన అన్ని వ్యవసాయ భాగాలను కలపడం ద్వారా వ్యవసాయం చేస్తారు. ఈ విధానంలో, అన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉండడం వల్ల, వాటి దిగుబడి కూడా ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉంటుంది.
ఏడాది పాటు, ఒకే పంటను పండించడం వల్ల భూమి యొక్క సారం అనేది తగ్గిపోతుంది. అదే ఈ విధానంలో రెండు మూడు పంటలు, పాడి, పౌల్ట్రీ, పుట్టగొడుగులు, కూరగాయలు, వర్మీ కంపోస్ట్ ఒకే చోట పెంచడం వల్ల, భూమి యొక్క సారం రెట్టింపు అవుతుంది. ఈ సమీకృత వ్యవసాయం కోర్సు గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టండి.