ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
స్థానిక నాటీ రకానికి చెందిన గేదెలతో పోలిస్తే ఎక్కువ పరిమాణంలో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెల పెంపకం పాల కేంద్రం ఏర్పాటుకు అనుకూలం. వీటి పాలలో ఎక్కువ పరిమాణంలో కేలరీలు ఉంటాయి. ముర్రా గేదె హర్యాణ, పంజాబ్ ప్రాంతానికి చెందిన గేదెలు అయినా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులకు కూడా అనుకూలం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ముర్రా జాతి గేదెలు డెయిరీ రంగంలో రాణించాలనుకునే వారికి చాలా ఉపయుక్తం. మరెందుకు ఆలస్యం ఈ కోర్సులో వీటి పెంపకం గురించి వివరాలు తెలుసుకుందాం రండి.