ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మీరు సేంద్రియ పద్ధతుల్లో మామిడిని పండించాలనుకుంటున్నారా? అయితే మా ffreedom App యొక్క ఆర్గానిక్ మ్యాంగో ఫార్మింగ్ కోర్సు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మామిడిని పండించడానికి అభ్యాసకులకు అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. మామిడి సాగు శతాబ్దాలుగా భారతదేశంలో వ్యవసాయంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది.
భారతదేశం అంతటా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది రైతుల జీవనోపాధిలో మామిడి సాగు కీలక పాత్ర పోషిస్తుంది. మామిడి సాగులో మొక్కలు నాటడం, కోయడం, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ తదితర అంశాలు ముడిపడి ఉండటం వల్ల ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలను అందిస్తుంది. అదనంగా, భారతీయ మామిడి పండ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల అధిక లాభాలు అందుకోవడానికి వీలవుతుంది.
ఈ కోర్సులో అభ్యాసకులు మామిడి సాగు యొక్క వివిధ అంశాల గురించి తెలుసుకుంటారు. మామిడి సాగుకు సరైన స్థలాన్ని ఎంచుకోవడం, నేల తయారీ, మొక్కలు నాటే పద్ధతులు, నీటిపారుదల పద్ధతులు తెగులు మరియు వ్యాధుల నిర్వహణ, పంటకోత మరియు పంట కోత తర్వాత నిర్వహణ పద్ధతులు ఇలా అనేక అంశాల గురించి ఈ కోర్సు వివరిస్తుంది. ఈ కోర్సు మామిడి సాగుతో ముడిపడి ఉన్న ఆర్థిక అంశాలను కూడా వివరిస్తుంది.
కోర్సుకు మెంటార్ కంచర్ల భాస్కర్ రెడ్డి. ఇతను పెద్దగా చదువుకోకపోయినా సహజ పద్దతుల్లో మామిడి తోటను పెంచుతూ అధిక లాభాలను అందుకుంటున్నారు. మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యాసకులు వారి సేంద్రీయ మామిడి సాగుకు సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించడానికి మరియు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి అవసరమైన విశ్వాసం మరియు పరిజ్ఞానం పొందుతారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి సేంద్రియ సాగుకు సంబంధించిన లాభాలు అందుకోవడానికి చేసే ప్రయాణంలో మొదటి అడుగు వేయండి.
ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?
సేంద్రియ విధానంలో మామిడి సాగును ప్రారంభించాలని భావిస్తున్నవారు.
అగ్రికల్చర్, హార్టికల్చర్ తదితర కోర్సులను చదువుతున్న విద్యార్థులు
వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను వెతుక్కునే వ్యాపారవేత్తలు
మామిడి సాగులోని నూతన విధానాలు, సాంకేతికతలు గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక రైతులు
స్థిరమైన, అధిక ఆదాయంతో పాటు పర్యావరణ అనుకూల సాగు విధానాల పట్ల ఆసక్తి ఉన్నవారు
ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:
మామిడి సాగుకు అవసరమైన నేల రకాన్ని ఎంచుకోవడం ఎలాగో తెలుసుకుంటారు
ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన సేంద్రీయ మామిడిని పండించడానికి అనువైన పద్ధతులు
తెగులు మరియు వ్యాధుల నిర్వహణ వ్యూహాలు
మామిడి పంట కోత తర్వాత నిర్వహణ మరియు మార్కెటింగ్ పద్ధతులు
లాభదాయకమైన సేంద్రియ మామిడి సాగుతో పాటు వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన వ్యూహాలు
మాడ్యూల్స్