ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పంగాసియస్ చేపలు అనగానే, మీరందరూ ఇంతకుముందు ఎప్పుడూ వినలేదే అని అనుకోవచ్చు. అయితే క్యాట్ ఫిష్ అనో లేదా వాలుగ చేప అంటే మాత్రం యిట్టె చెప్పేస్తారు. చాలా మంది ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. మిగతా చేపలతో పోలిస్తే, పంగాసియస్ క్యాట్ ఫిష్ చూడడానికి విభిన్నంగా ఉంటుంది. దీనికి పొలుసులు ఉండవు. అందుకనే, చాలా మంది వీటిని తినడానికి ఆసక్తి చూపించరు. కానీ దీనిలో ఉండే పోషకాలు, దీని గురించి తెలుసుకుంటే, నెక్స్ట్ టైం, వద్దని అనలేరు!
వీటిలో కేవలం, ఒకే ముల్లు ఉండడం వల్ల, హోటల్స్ మరియు రెస్టారెంట్లలో అపోలో ఫిష్ అనే వంట కోసం వినియోగిస్తారు. ఈ డిష్, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వంటకం. దీనిని ఫంగస్ చేప లేదా బస చేప, పంగా చేప అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది గుండెకి మంచిది, అలాగే తక్కువ కొవ్వు కలిగిన ఈ చేపలో ప్రోటీన్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల, ఆరోగ్యం కోసం కూడా చాలా మంది వీటిని తింటూ ఉంటారు. ఇది మంచి నీటి చేప. దీనిని సరిగ్గా పెంచగలిగితే, ఒకసారి 7 నెలలలో, దీని ద్వారా 20 లక్షలు, సంపాదించవచ్చు.