ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పూలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విడదీయని అనుబంధం ఉంది. ప్రతి పండుగలోనూ వీటి వాడకం తప్పనిసరి. అంతేకాకుండా కొన్ని రకాల పూలను అలంకరణ కోసం ఎక్కువగా వాడుతున్నారు. మరోవైపు ఫర్‌ఫ్యూమ్స్ తయారీలో ఇవి ముడి పదార్థాలు. ఉదాహరణకు గెర్బెరా పూలు. ఇటువంటి పూలను ఎక్కువ పరిమాణంలో పాలిహౌస్‌లో సాగు చేసి ఏడాదికి రూ.17 లక్షల నికర లాభాన్ని పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ కోర్సు ద్వారా పాలీహౌస్ పూల వ్యవసాయం గురించి వివరాలు తెలుసుకుందాం రండి.