ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మాంసాహారం తినే అందరికి, ఎంతో ఇష్టమైనవి రొయ్యలు. రొయ్యల కూర అలా నోట్లోకి వెళ్తూ ఉంటె, జీవితానికి ఇది చాలు అని అనిపిస్తుంది. దానికి ఉన్న ఆ రుచి వల్లే, ధర కాస్త ఎక్కువైనా, తక్కువైనా జనాలందరూ ఎగబడి కొంటుంటారు. ఇదే, రొయ్యల చెరువు సాగు చేసేవారికి, కాసుల వర్షం కురిపిస్తూ ఉంది.
రొయ్యల సాగు, మిగతా వాటితో పోల్చినప్పుడు, కాస్త కష్టమైనదే అయినప్పటికీ, చేసే పద్దతులను సరిగ్గా తెలుసుకోని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, దీనికంటే గొప్ప బిజినెస్ ఇంకొకటి ఉండదు.
అందుకే, రొయ్యల సాగు చేసే రైతులు, తరతరాల నుంచి మంచి సంపాదన గడిస్తున్నారు.మొదటి నుంచే సరియైన ప్లానింగ్ తో ముందుకు వెళ్ళితే, తప్పకుండా కోట్లు కుమ్మరించే బిజినెస్ అవుతుంది. ఇంతకుముందు, ఇందులో అనుభవం ఉన్నవారైనా, లేదా ఈ బిసినెస్ మీద మక్కువతో దీనిని ప్రారంభించి, నష్టపోయిన రైతులకి అయినా, మా కోర్స్ వారి జీవితాలలో అద్భుతం చెయ్యనుంది.