ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
సీ బాస్ చేపలు అనగానే, మీరందరూ ఇంతకుముందు ఎప్పుడూ వినలేదే అని అనుకోవచ్చు. అయితే పండుగప్ప చేప అంటే మాత్రం యిట్టె చెప్పేస్తారు. చాలా మంది ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. మిగతా చేపలతో పోలిస్తే, పండుగప్ప చేప చూడడానికి విభిన్నంగా ఉంటుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సాల్మన్ చేపకు, దీనికి మధ్య ఎప్పుడూ రుచిలో గట్టి పోటీ ఉంటుంది.
సీ బాస్ చేప అన్ని చోట్ల దొరకదు. అందువల్ల, దీనికి డిమాండ్ చాలా ఎక్కువ! కేజీ ధర 400 పలుకుతుంది. క్రిస్మస్ లేదా జూన్, జులై సీజన్ లో డిమాండ్ ఇంకా అధికంగా ఉంటుంది. అప్పుడు ధర రూ. 800 పలికే అవకాశం ఉంది. ఈ సీ బాస్ చేపల పెంపకం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఫిష్.
దీనిలో ఉండే పోషకాలు గురించి తెలుసుకుందాం! ఇది గుండెకి మంచిది, అలాగే తక్కువ కొవ్వు కలిగిన ఈ చేపలో మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ b6, ప్రోటీన్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల, ఆరోగ్యం కోసం కూడా చాలా మంది వీటిని తింటూ ఉంటారు. ఇది మంచి నీటి మరియు ఉప్పునీటి చేప! దీనిని సరిగ్గా పెంచగలిగితే, 7 నెలలలో, దీని ద్వారా కోట్లు సంపాదించవచ్చు.