ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
స్పిరులినా అనేది ఒక సముద్రపు నాచు. ఇది రకమైన నీలి-ఆకుపచ్చ ఆల్గే, ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. స్పిరులినా అనేది నీటిలో పెరిగే మొక్క. సాధారణంగా, ఇది భూమితో సంబంధం కలిగి ఉండదు. దీనిని యార్డ్, బాల్కనీ, కిటికీ లేదా పైకప్పులలో కంటైనర్ లలో పెంచుకోవచ్చు.
ఈ మొక్కకు అధిక pH ఉన్న నీరు అవసరం. అలాగే, వీటికి ఎండ కూడా తగినంత ఉండాలి. ఇందులో ఎన్నో పోషకాలు ఉండబట్టే, దీనిని అన్నీ చోట్లా వినియోగించడం మొదలుపెట్టారు. ఇది కేవలం మీకోసమే కాదు, మీ పాడి పశువులకు లేదా చేపలకు, రొయ్యలకు ఇలా అన్ని చోట్లా ఉపయోగ పడుతుంది. ఇది మన ఒంట్లోని క్రొవ్వుని తగ్గించుకోవడానికి ఉపయోగ పడుతుంది. అలాగే, రక్తపోటు, హృదయ రోగులు, మధుమేహం ఉన్న, వారందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది! కానీ దీనిని పెంచే వారి సంఖ్య మాత్రం అంతగా లేదు. కావున, ఈ బిజినెస్ కు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది.