ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే పండ్లలో, జామ ఒకటి. మనకు దాదాపు ముప్పైకి పైగా జామకాయల రకాలు లభిస్తాయి. అందులో అందరూ ఎక్కువగా ఇష్టపడేది తైవాన్ జామ. ఇందులో విటమిన్ ఏ,బి,సి,లతో పాటుగా, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం, వంటి అనేక రకాల పోషకాలతో నిండి ఉన్నాయి. ఇది మధుమేహం వ్యాధిగ్రస్తులకు, హృదయ రోగస్థులకి, చాలా మంచిది. మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే చర్మానికి కూడా చాలా మంచిది. అందుకే, చాలా మంది వీటిని తమ డైట్ లలో, చేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, వీటిని ఇష్టపడి తింటుంటారు.
అందుకే, వీటిని చాలా ప్రాంతాల్లో పండిస్తున్నారు. ప్రతి ఏటా, 55 మిలియన్ టన్నుల జామ సాగు అనేది జరుగుతూ ఉంటె, అందులో 45 శాతం దాకా భారతదేశం నుంచే దిగుమతులు చేసుకుంటున్నారు. ఇది 200 గ్రాముల నుంచి కేజీ దాకా పెరుగుతుంది. ఒక కేజీ ధర, రూ.80-120 మధ్య ఉంటుంది. ఇది 365 రోజులు దిగుబడిని ఇచ్చే పంట. వీటిని సరిగ్గా సాగు చెయ్యడం వల్ల, ఏడాదికి అక్షరాలా 30 లక్షలు సంపాదించవచ్చు! .