ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మనం పొలానికి ఎరువులు వేస్తూ ఉంటాం, మందులు వేస్తూ ఉంటాము. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ కృత్రిమ ఎరువులు వెయ్యడం వల్ల, కొంత కాలానికి భూమి/ మట్టి యొక్క సారం పూర్తిగా దెబ్బ తింటుంది. కొంత కాలానికి, అవి బీడు భూములుగా మారిపోతూ ఉంటాయి. అందువల్ల, కృత్తిమ ఎరువులు/ మందులు వినియోగం అవసరానికి మించకుండా, మితంగా ఉండాలి కానీ, ఎక్కువ కాలం లేదా ఎక్కువ మోతాదులో వినియోగిస్తే, మొదటికే మోసం వస్తుంది.
ఇందుకే, ఇప్పుడు రైతులు సేంద్రియ ఎరువులను ప్రమాయత్నంగా చూస్తున్నారు. ఇవి ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, ఈ మధ్య వీటికి ఆదరణ పెరిగింది. వీటి వల్ల మట్టి యొక్క సారం పెరుగుతుంది. సారవంతమైన మట్టి, మంచి దిగుబడిని అందిస్తుంది. ఇందులో బెడ్ మెథడ్ మరియు గుంత వర్మీ కంపోస్ట్ ఉన్నాయి. మీకు ఎక్కువ మొత్తంలో, సేంద్రియ ఎరువులు కావాలి అంటే, పిట్ విధానంలో సాగు చెయ్యండి.