ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
క్రెడిట్ కార్డు గురించి మీలో తెలియని వారు ఉండరు. ఇప్పటికే, “మీకు క్రెడిట్ కార్డు కావాలా?” అనే కాల్స్ వచ్చే ఉంటాయి. అయితే, మనలో దీని గురించి పూర్తిగా తెలియక, చాలా మంది, క్రెడిట్ కార్డు తీసుకుని, తర్వాత కట్టలేక చేతులు కాల్చుకున్నాం అని అర్ధం చేసుకుంటారు. క్రెడిట్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వీటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, మీరు దీనిని వినియోగించినట్టు అయితే, చిక్కుల్లో పడనున్నారు.
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పనిచేసే విధానంలో తేడా ఉంటుంది. చాలా మంది, క్రెడిట్ కార్డును ఋణం తీసుకుంటున్నట్టుగా భావిస్తారు. అయితే, దీనికి ఋణం తీసుకోవడానికి వ్యత్యాసం ఉంది. డెబిట్ కార్డు లో, మీరు మీ బ్యాంకు లో ఉన్న, సొమ్మును (మీ డబ్బును) ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. క్రెడిట్ కార్డు విధానంలో, మీరు ముందుగా బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుంటారు. తిరిగి నిర్ణయించిన తేదీ లోపల వాటిని బ్యాంకుకు చెల్లించవలసి ఉంటుంది. మీ నిర్ణిత తేదీలో దానిని చెల్లించని పక్షంలో, మీకు బ్యాంకువారు వడ్డీ వేస్తారు. అయితే, ఇలాంటి విషయాలను మనం పట్టించుకోకపోతే, అవి తీవ్ర పరిణామాలుగా మారే అవకాశం ఉంది. ఈ కోర్సులో, వీటి గురించి పూర్తిగా తెలుసుకోని, క్రెడిట్ కార్డు ద్వారా లాభ పొందండి