ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో డబ్బు చాలా అవసరమవుతుంది. అటువంటి సమయంలో గుర్తుకు వచ్చే మొదటి పదం “లోన్”. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. బ్యాంకులు లేదా ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి లోన్ తీసుకోవాలంటే ఇన్‌కమ్ ప్రూఫ్ వంటి ఎన్నో పత్రాలను బ్యాంకులకు అందజేయాలి. అదే సమయంలో క్రెడిట్ స్కోర్ కూడా ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ సరిగా ఉన్నా కూడా ఆ లోన్ అమౌంట్ మన చేతికి అందడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ గంటలోపు మన చేతికి లోన్ అమౌంట్ రావడానికి ఉన్న మొదటి అవకాశం “గోల్డ్ లోన్”. మరెందుకు ఆలస్యం ఈ గోల్డ్‌లోన్ కోర్సు నుంచి తెలుసుకుందాం పదండి!