ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఒక్కసారి చదువు పూర్తి అవ్వగానే, ఉద్యోగం కోసం వేట మొదలు పెడతాం. కొంత మందికి, వెంటనే లభిస్తుంది. ఇంకొంత మంది, సంవత్సరాలు… సంవత్సరాలు నిరుద్యోగిగా మిగిలిపోతారు. సాధారణంగా మన 20,30,40 లలో ఉద్యోగాలు చేస్తూ, క్షణం తీరిక లేకుండా బతుకుతాం. అసలు సమస్య ఆ తర్వాతే ప్రారంభం అవుతుంది. వయసు పెరిగే కొద్దీ, ఆరోగ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అరవై దాటాక, పదవీ విరమణ తర్వాత, మీ సంపాదన అనేది పూర్తిగా నిలిచిపోతుంది. అటువంటి సమయాల్లో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, కేంద్ర ప్రభుత్వంజాతీయ పెన్షన్ పథకం ను ప్రవేశ పెట్టింది.
2009 వరకు, ఇందులో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే అవకాశం ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత, ఇందులో ఎవరైనా, పెట్టుబడి పెట్టవచ్చు అని సవరించింది. మీరు దాచే సొమ్ము, మీ రిటైర్మెంట్ తర్వాత 60% ఒకే సారి వస్తుంది. మిగతా 40 శాతం మీకు నెల వారి పెన్షన్ కింద వస్తూ ఉంటుంది. ఇందులో మోసం జరగడానికి ఛాన్స్ లేదు. మీరు రిస్క్ తీసుకోవడం ఇష్టపడితే, మీ డబ్బును బాండ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.