ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రైతులు దేశానికీ వెన్నెముక వంటి వారు. మన దేశంలో దాదాపు 80 శాతం మంది ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మన దేశ జీడీపీ లో కూడా, వ్యవసాయం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎన్నో ముడి సరుకులు, ఎగుమతులు కోసం కూడా, మన దేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది.
వ్యవసాయం లేదా వ్యవసాయ ఆధారిత పదార్థాలు లేకపోతే, మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఫైనాన్స్ అనేది ప్రతి రైతూ తెలుసుకోవాల్సిన అంశం. రైతులకి జ్ఞానం, అవకాశం కలిపిస్తే చాలు, వారు వాటిని ఉపయోగించుకొని, అభివృద్ధి చెందుతారు. మన ఖర్చులు, లాభాలు, లక్ష్యాలు వాటన్నిటిని పరిగణించి, వ్యహం రచించే అవకాశం, రైతులకు వ్యక్తిగత రుణం ద్వారా సాధ్యపడుతుంది. ఈ వ్యూహాన్ని, మనం పక్కా ప్రణాళిక ద్వారా అమలు చేసుకుంటూ పోతే, అనతి కాలంలోనే, మన ఆర్థిక స్థితిలో మంచి మార్పులు సంభవిస్తాయి. అలాగే, ఈ కోర్సులో రైతులకి పంటలతో పాటు, వారి జీవితానికి కూడా బీమా అనేది ఎంత ముఖ్యమో తెలుసుకోండి!