ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పరిచయం:
మీరు పైన పేరు చదవగానే, మీకు అర్ధం అయ్యే ఉంటుంది కదా! ఇది, నెల నెలా వడ్డీని సంపాందించే ప్రక్రియ అని! అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిని, రిటైర్ అయిన వారి కోసం ప్రవేశ పెట్టింది. ఇందులో ఒక్కసారి, మీరు రిటైర్ అయ్యాక పెట్టుబడి పెడితే, మన కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి వయా వందన యోజన స్కీం వల్ల, మీరు నెల నెలా వడ్డీను పొందవచ్చు. పైగా ఇది పూర్తి సురక్షితం కూడా! ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి తెలుసుకుందామా?
ఇందులో పది ఏళ్ళ పాటు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. మీరు కనిష్టంగా 1.5 లక్షలు, గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడిని పెట్టవచ్చు. 2017 లో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రభుత్వం ప్రారంభించింది. రిటైర్ అయిన వారికి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, ఇదే బెస్ట్ ఆప్షన్!