ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
వయసు పెరిగే కొద్దీ, ఆరోగ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అరవై దాటాక, పదవీ విరమణ తర్వాత, మీ సంపాదన అనేది పూర్తిగా నిలిచిపోతుంది. అటువంటి సమయాల్లో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం ను ప్రవేశ పెట్టింది.
రిటైర్డ్ అయిన తర్వాత, మీకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. అదీ అందరికి తెలిసిన విషయమే! అయితే, ఇటువంటి సమయంలో, మీకు డబ్బు అవసరం వెంటనే లేకపోవచ్చు. లేదా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవడం ద్వారా, మీ బంధువుల నుంచి, లేదా బయటి వ్యక్తుల నుంచి మీకు ప్రమాదం ఉండొచ్చు. ఇటువంటి, పరిస్థితుల్లో మీరు సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం ద్వారా మీ డబ్బుని పొదుపు చెయ్యొచ్చు. ఇది కేవలం 60 ఏళ్ళ వయసు దాటిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇదొక వన్-టైం ఇన్వెస్ట్మెంట్ పథకం. అంటే, ఇందులో మీరు డబ్బు మొత్తం ఒకేసారి పొదుపు చెయ్యవలసి ఉంటుంది. ఆ డబ్బు ఐదేళ్ల తర్వాత మీకు లభిస్తుంది.
ఒక ఆర్థిక వార్షికంలో, మీకు మీ డబ్బుకి సంబందించిన వడ్డీ డబ్బులు, నాలుగు సార్లు అందుతాయి. ఇందులో వడ్డీ 7.4% ఉంటుంది.