ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మిగతా పొదుపు రకాలతో పోలిస్తే, ఎక్కువ వడ్డీ పొందే, సుకన్య సమృద్ధి యోజన గురించి ఇప్పుడే తెలుసుకోండి. ఈ కోర్సు గురించి, ఇక్కడ పూర్తిగా చదివి, ఇప్పుడే ఈ పథకం లో చేరి లబ్ది పొందండి. ఈ పథకాన్ని, మన కేంద్ర ప్రభుత్వం జనవరి 22, 2015 నాడు ప్రవేశపెట్టింది. ఇది “బేటీ పడావో- బేటీ బచావో” అనే పథకం కింద వచ్చిన ఒక గొప్ప పొదుపు పథకం. మనకి డబ్బులు పొదుపు చెయ్యడానికి, ఇప్పటికే చాలా పథకాలు ఉన్నాయి. అవి మీ అందరికి తెల్సిందే!
వాటన్నిటిలో కల్లా అత్యుత్తమ పథకం, సుకన్య సమృద్ధి యోజన (SSY) అని చెప్పుకోవచ్చు. ఇందులో కేవలం, ఆడపిల్లల కోసం మాత్రమే పొదుపు చేయగలము! అందుకు కారణం లేకపోలేదు. మన దేశంలో, 51.96 శాతం మగవారు ఉంటె, కేవలం 48.04 శాతం మంది ఆడవారు ఉన్నారు. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం, చాలా మంది తల్లి దండ్రులు, ఆడవారిని లేదా ఆడపిల్లలను భారంగా చూడడమే!
ఈ ఆలోచనా నిర్మూలనలో భాగంగానే, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల్ని ప్రవేశ పెట్టింది.
అందులో ఒకటి, ఈ సుకన్య సమృద్ధి యోజన! మిగతా వాటిలో పోలిస్తే, ఇందులో వడ్డీ శాతం చాలా ఎక్కువ! అలాగే, గడువు పూర్తి అయ్యాక తీసుకునే సమయంలో, ఎటువంటి టాక్స్ కూడా చెల్లించడం అవసరం లేదు. అంతే కాకుండా, మనం జత చేసిన సొమ్ముకి 7.6 శాతం వడ్డీని సంవత్సరానికి ఇస్తూ ఉంటారు. ఇందులో మీరు 250 రూపాయల నుంచి, ఒక లక్షా యాభై వేల దాకా మీరు దాయ వచ్చు !