Anniversary

"మీ చుట్టూ ఉన్న సమాజం మీ సంపద విలువను నిర్ణయిస్తుంది; కాబట్టి విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో పాలుపంచుకుందాం.”

 
    సెప్టెంబర్ 18, 2022 "సువిజన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్" యొక్క 14వ వార్షికోత్సవం మరియు నేను వ్యాపారవేత్తగా నా ప్రయాణాన్ని ప్రారంభించిన రోజు.  
 
    నేను చాలా వెనుకబడిన మారుమూల గ్రామానికి చెందినవాడను. 7వ తరగతి చదువుతున్న సమయంలో, మా గ్రామానికి కరెంటు వచ్చిందంటే మా గ్రామం ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోండి. విలాస వంతమైన జీవనశైలి, సౌకర్యవంతమైన జీవితం అనేది మాకు ఊహల్లో మాత్రమే కనిపించేది.  
 
     కానీ, నేను గ్రాడ్యుయేషన్ కోసం మా గ్రామం నుండి షిమోగా నగరానికి వెళ్ళినప్పుడు , నేను అక్కడ చాలా కొత్త విషయాలను చూశాను. కొన్నింటిని నేర్చుకొన్నాను. దీంతో నా ఊహ విస్తరించింది. అటు పై ఉద్యోగ అన్వేషణలో భాగంగా బెంగళూరు నగరానికి చేరుకోవడం, అక్కడ నాకు ఇంటర్నెట్ పరిచయం కావడంతో నా ఆలోచనా పరిధి పూర్తిగా మారిపోయింది. కువెంపు, యు ఆర్ అనంతమూర్తి (జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు) & కడిదల్ మంజప్ప (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి) వంటి ఎందరో గొప్ప వ్యక్తులను, ఈ దేశానికి బహుమతిగా ఇచ్చిన ప్రదేశం నుండి వచ్చాను. దీంతో జీవితంలో స్థిరపడటం కంటే, నా జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నాను.  
 
     ఈ క్రమంలోనే, ఇన్సూరెన్సు సేల్స్‌ ఏజెంట్ చేతిలో మోసపోయిన ఒక ఆటో డ్రైవర్‌ను కలవడం జరిగింది. అప్పుడే భారతదేశంలో, ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకున్నాను. ఆలస్యం చేయకుండా నా ఆలోచనను, ఆచరణలోకి తీసుకువచ్చి భారతదేశపు మొట్టమొదటి & అతిపెద్ద ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ సంస్థను నిర్మించాను. ఈ సంస్థ కాల్ సెంటర్ ద్వారా, నాతో పాటు నా సంస్థ సిబ్బంది, 9 మిలియన్ల మందికి పైగా ప్రజలకు పైనాన్సియల్ ఎడ్యుకేషన్ అందించడం ద్వారా, వారికి ఆర్థిక అవగాహనలో ఎంతో మార్పు తీసుకువచ్చాము. అయితే, ఇది మాకు పూర్తి సంతృప్తిని అందించలేదు. దీంతో మరింత ఉన్నతమైన, స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించాలని భావించాము. ఇందుకోసం వివిధ భాషల్లో ప్రజలకు ఫైనాన్సియన్ ఎడ్యుకేషన్ అందించడానికి, మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ సమయంలోనే ప్రజలకు తమ సొమ్ము నిర్వహణ విషయమై తీసుకోవాల్సిన మెళుకువలను తెలియజేయడమే లక్ష్యంగా ffreedom.com ని స్థాపించాము. అయితే ఈ యాప్ రూపొందించడానికి ముందు, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలనుకున్నాము. ఇందుకోసం డబ్బుతో మనం చేసే ఐదు అతి ముఖ్యమైన పనులు - సంపాదించడం, ఆదా చేయడం, ఖర్చు చేయడం, పెట్టుబడి పెట్టడం & రుణం తీసుకోవడం వంటి విషయాల పై, ప్రజల ఆలోచన విధానంలో మార్పు తేవడం లక్ష్యంగా, నేను నవంబర్ 3, 2019 నుండి మార్చి 6, 2022 వరకు ఫైనాన్షియల్ ఫ్రీడం పేరుతో 28 వర్క్‌షాప్‌లను నిర్వహించాను. ఈ వర్క్ షాపుల ద్వారా 7,000 మందికి పైగా, వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులను కలుసుకున్నాను. అయితే, వర్క్ షాపులకు వచ్చినవారిలో చాలా మంది మిగిలిన నాలుగు విషయాలతో పోలిస్తే “సంపాదించడం” పై ఎక్కువ ఆసక్తి చూపేవారు. అంతేకాకుండా, "సొమ్ము నిర్వహణ మాకు తెలియని విషయం కాదు, కానీ నిర్వహణకు అవసరమైన డబ్బు మా వద్ద లేదు" అనే విషయం మాకు తెలియచేసారు . 
 
     మీరు ఈ సమస్యను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, గత రెండు దశాబ్దాలలో, ప్రపంచం ఎంతగా మారిందో మీకే అర్థమవుతుంది. మా గ్రామం విషయమే తీసుకుందాం! 5వ తరగతి చదువుతున్న విద్యార్థికి కూడా, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతోందో, క్షణాల్లో తెలుసుకుంటున్నాడు. ఇందుకు ప్రధాన కారణం, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే! నా భారతదేశం,ఇంతటి సమాచార విప్లవాన్ని సాధించడం పట్ల నేను గర్వపడుతున్నాను. అంతేకాకుండా, సంతోషంగా ఉన్నాను. అయితే అదే సమయంలో, ఈ సమాచార విప్లవం కలుగజేస్తున్న నష్టాలు, నన్ను ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, తన ఆకాంక్షలను నెరవేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, ప్రతి ఒక్కరు న్యాయ సమ్మతమైన మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలి. లేకుంటే, వారు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి “షార్ట్‌కట్స్” వెదుక్కొంటారు. ఇది సమాజానికి ప్రమాదకరం!  
 
     ప్రభుత్వ పాఠశాలలు/ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర సిలబస్/CBSE/ICSE/IB మరియు కన్నడ మీడియం/హిందీ మీడియం/ఇంగ్లీష్ మీడియం పేరుతో జరుగుతున్న వివక్షే స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద మోసంగా నేను భావిస్తున్నాను. ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఒకే విధమైన, నాణ్యమైన విద్యను అందిస్తే తప్ప, మనం సమ సమాజాన్ని నిర్మించలేమనేది నా భావన. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకూ జరిగిన విషయాలను మనం వెనక్కు తీసుకురాలేము. అయితే, ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఇటువంటి పక్షపాత విద్యా వ్యవస్థను రద్దు చేయడానికి, అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను! అదే సమయంలో, ఇప్పటి వరకూ అమలైన విద్యా వివక్ష కారణంగా నష్టపోయినవారిని విస్మరించలేము. వారు తమ జీవనోపాధిని నిర్మించుకోవడానికి కనీస పరిజ్ఞానం మరియు అవకాశాలను అందించాల్సి ఉంది. 
 
     అందువల్లే, మేము మా ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ కంపెనీని., లైవ్లీవుడ్ ఎడ్యుకేషన్ కంపెనీగా అప్‌గ్రేడ్ చేసి, ffreedom app పేరుతో 2020 మార్చి 20న అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రస్తుతం ffreedom app లో 6 భాషల్లో 900కి పైగా వ్యవసాయ,వ్యాపార మరియు పర్సనల్ ఫైనాన్స్ వాటికి చెందిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ, వ్యాపార రంగంలో విజయం చవిచూసిన 1500 మంది మెంటార్స్ ప్రతి రోజు లక్షల మందికి ఈ కోర్సులను బోధిస్తున్నారు. ఈ క్రమంలో, మేము ffreedom app ద్వారా, గత 30 నెలల్లో దాదాపు కోటి మందికి పైగా అధిక-నాణ్యత గల జీవనోపాధి విద్యను అందించాము. వీరిలో 1.65 లక్షల మందికి పైగా మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం.  
 
     "అవసరమైన పరిజ్ఞానం & ఉపాధి అవకాశాలను కల్పించడం" ప్రధాన లక్ష్యంగా, గత ఏడాది మా బృందం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. అందులో, ముఖ్యమైనవి కొన్ని:
  1. ఐకాన్స్ ఆఫ్ భారత్ (సీజన్ 1) - ఇది 28 ఎపిసోడ్‌ల టీవీ రియాలిటీ షో. ఇందులో 60 మంది, ఉత్తమ మైక్రో ఎంట్రప్రెన్యూర్ తమ విజయాన్ని వీక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో, తాము ఎదుర్కొన్న సమస్యలు, వాటికి కనుగొన్న పరిష్కారాలను కూడా తెలియజేసారు. ఈ కార్యక్రమం NDTV ఇండియాలో, మే 29వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ప్రతి శని & ఆదివారాల్లో రాత్రి 9.30 నుండి 10.30 గంటల మధ్య ప్రసారం చేయబడింది. 
  2. ffreedom Show - మేము ప్రస్తుతం కన్నడ & తెలుగులోని 5 TV ఛానెల్‌ల భాగస్వామ్యంతో ffreedom షో ని నిర్వహిస్తున్నాము. 
  3. ffreedom Nest - ffreedom appలో కోర్సులను చూసిన తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించిన మా యాప్ వినియోగదారులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడమే, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం! 
 
    "అవసరమైన పరిజ్ఞానం & ఉపాధి అవకాశాలను కల్పించడం" అనే మా లక్ష్యంలో భాగమై, మెరుగైన భారత్‌ను నిర్మించేందుకు, తమ వంతు కృషి అందించిన 1500+ మెంటార్లకు,ఈ సందర్భంగా నేను మొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా, మైక్రో ఎంట్రప్రెన్యూర్ గా ఎదగడానికి నిర్ణయించుకున్న ffreedom appలోని కోటి మందికి పైగా ఉన్న సభ్యుల ధైర్యాన్ని, నేను అభినందిస్తున్నాను. సహాసంతో కూడిన ఈ ప్రయాణంలో, తోడుగా నిలిచిన నా బృందంలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు లేకపోయి ఉంటే, నేను ఇన్ని విజయాలు సాధించడం వీలయ్యేది కాదు. అదేవిధంగా, ప్రతి సందర్భంలో నన్ను ముందుండి నడిపించిన మా చైర్మన్ & నా గురువు శశి సర్ గారికి, నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. నా పై విశ్వాసం ఉంచిన సంస్థ బోర్డు సభ్యులు & పెట్టుబడిదారులందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా కార్యక్రమాలను, ప్రజల్లోకి తీసుకువెళ్లినందుకు మరియు మాకు మద్దతుగా నిలిచినందుకు మా మీడియా మిత్రులందరికీ నేను తప్పక ధన్యవాదాలు తెలపాలి. వీరికే కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, తమ జ్ఞానాన్ని వినియోగించినవారికి కూడా తప్పక కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే, వారు ఆ విధంగా చేయడం ద్వారానే మేము వినూత్న మార్గంలో సంస్థను వృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్తున్నాం. చివరగా నా లక్ష్యానికి ఎప్పుడూ మద్దతుగా నిలిచి ఎన్నో త్యాగాలు చేసిన, నా కుటుంబానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను.  
 
    నేను ముగించే ముందు, నా శ్రేయోభిలాషులందరికీ ప్రమాణం చేస్తున్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, త్వరలో మనం లైవ్లీవుడ్ ఎడ్యుకేషన్ ఫ్లాట్‌ ఫామ్ నుంచి “లైవ్లీవుడ్ ఫ్లాట్‌ ఫామ్ ఫర్ ది వరల్డ్” గా మారబోతున్నాం.  
 
ఇట్లు మీ శ్రేయోభిలాభి
 
C S Sudheer 
Founder & CEO, ffreedom app